- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భూమి నుండి శబ్దాలు… ఆ కాలనీలో భయం భయం
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో భూమి నుండి శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూమి నుండి వస్తున్న శబ్ధాలను భూ కంపంగా భావించి ఇండ్ల నుండి జనాలు బయటకు పరుగులు తీశారు. రాత్రంతా వర్షంలోనే స్థానికులు జాగారం చేశారు.
కాలనీలో మొదట మంగళవారం అర్ధరాత్రి భూమి నుండి శబ్దాలు రావడంతో ఆందోళన చెందారు. ఇండ్ల లోని వస్తవులు కదలడం, గేట్లు, సామాగ్రి ఊగిపోవడంతో భూకంపమని భయంతో రోడ్ల మీదకు వచ్చారు. ఆ తర్వాత బుధవారం తెల్లవారు జామున ఇండ్లలోకి వెళ్లారు. కాగా తిరిగి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పలు విడతలుగా శబ్ధాలు రావడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు.
ఇండ్లలోకి వెళ్లేందుకు భయపడ్డారు. ఈ విషయమై అధికారులకు సమాచారం అందించారు. కానీ శబ్ధాలు ఎందుకు వచ్చాయనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బ్లాస్టింగ్ సమయంలో చేసే శబ్ధాలతో ఇవి సరిపోవడం లేదనీ అన్నారు. దీంతో అధికారులు స్పష్టత నిచ్చే వరకు ఏం చేయాలో పాలు పోవడం లేదని స్థానికులు చెప్పారు.