- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్వరలో దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులు!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. దీనికోసం ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న వినియోగదారులు, యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్ లాంటి ఆన్‌లైన్ మోడ్‌లను ఉపయోగించలేని వారికోసం ఆఫ్‌లైన్ చెల్లింపులు ఎంతో దోహదపడతాయని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకు తగిన ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఆఫ్‌లైన్ చెల్లింపులను 2020 ఆగష్టులోనే పైలట్ ప్రాజెక్ట్‌గా ఆర్‌బీఐ మొదలుపెట్టింది.
తక్కువ విలువ కలిగిన రిటైల్ లావాదేవీలు, కార్డులు, మొబైల్ నుంచి పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చింది. ఈ విధానంలో రూ. 200 వరకు గరిష్ఠ మొత్తాన్ని నిర్ణయించారు. పూర్తిస్థాయిలో అమలు చేశాక రూ. 2000 గరిష్ఠ మొత్తంగా అనుమతివ్వనున్నారు. పైలట్ ప్రాజెక్టు కోసం ఆర్‌బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ఇలాంటి ఆఫ్‌లైన్ డిజిటల్ చెల్లింపులు సదుపాయం కల్పించేలా ఆర్‌బీఐ వెసులుబాటు ఇచ్చింది. ఆర్‌బీఐ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ ఈ ఏడాది మార్చి 31 వరకు కొనసాగింది. దీనికోసం ఎలాంటి ముందస్తు ధృవీకరణ లేకుండా చెల్లించేలా అనుమతించారు. ఈ ప్రాజెక్ట్ మెరుగైన ఫలితాలను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ చెల్లింపులకు ఆర్‌బీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది.