- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హమ్మయ్యా.. స్పాన్సర్లు దొరికారు
దిశ, స్పోర్ట్స్: కరోనా కష్ట కాలంలో క్రీడాలోకం స్తంభించింది. లైవ్ స్పోర్ట్స్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య తొలి ద్వైపాక్షిక సిరీస్ జరుగనున్నది. జూలై 8 నుంచి జరుగనున్న తొలి టెస్టు చరిత్రపుటల్లోకి ఎక్కనుంది. అయితే, కొవిడ్-19 కారణంగా అన్ని సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యాడ్స్‌పై రూ. కోట్లు ఖర్చుపెట్టడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న విండీస్, ఇంగ్లండ్ సిరీస్‌కు ఎవరైనా స్పాన్సర్లు దొరుకుతారా అనే అనుమానాలు నెలకొంటున్నాయి. ఈ సిరీస్‌ను ఇండియాలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తున్నది. తాజాగా సోనీ సంస్థ ఎనిమిది మంది స్పాన్సర్లను వెతికి పట్టుకుంది. స్కోడా, మై 11 సర్కిల్, ఎంగేజ్ డియోడరెంట్ బ్రాండ్లు ఈ సిరీస్ కో-ప్రెజెంటర్లుగా వ్యవహరించనుండగా బైజూస్, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ సుజుకీ, మొబైల్ ప్రీమియర్ లీగ్, డఫా న్యూస్‌లు అసోసియేట్ స్పాన్సర్లుగా వ్యవహరించడానికి ముందుకు వచ్చాయి. ఒక్కో యాడ్ క్యాటగిరీని బట్టి రూ.35లక్షలు, రూ.20లక్షలకే సోనీ సంస్థ అమ్మేసింది. ఈ సిరీస్ నుంచి తాము గట్టెక్కినట్లే అని సోనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు.