2024లో అతనే ప్రధానమంత్రి కావాలి.. నెటిజన్ల పాలాభిషేకం

by srinivas |
2024లో అతనే ప్రధానమంత్రి కావాలి.. నెటిజన్ల పాలాభిషేకం
X

దిశ, సినిమా : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రియల్ హీరో సోనూ సూద్‌కు పాలాభిషేకం నిర్వహించారు. లైఫ్ సైజ్ ఫొటోకు మాలలు వేసి అభిషేకం చేశారు. అభిమాని పులి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం వేదికగా సోనును ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయనలాగా అందరం ముందుకొచ్చి సహాయం అందిస్తే దేశంలో కరోనా మరణాలు అనేవి ఉండవని తెలిపారు. అడిగిన ప్రతీ ఒక్కరికీ హెల్ప్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న సోను 2024 ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Advertisement

Next Story

Most Viewed