- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 వేల ఇళ్లు కట్టిస్తున్న సోనూ సూద్
‘మీ అమ్మ నిన్ను తనకోసం కనలేదురా.. జనం కోసం కన్నది’ ఛత్రపతి సినిమాలోని ఈ డైలాగ్.. అక్షరాల సోనూ సూద్ కోసమే రాసినట్లు అనిపిస్తోంది. పక్కవాడి కష్టాలు చూసి, అమ్మో మనకిలాంటి కష్టాలు లేవులే అని సంతోషించే ఇలాంటి రోజుల్లో.. ఆ కష్టాలు చూసి చలించి, జనం కోసం పుట్టుకొచ్చిన నాయకుడు సోనూ సూద్. ఒక్కటేమిటి.. భారతదేశంలోని ప్రతీ ప్రాంతానికి తన సహాయం అందింది. ఆపదలో ఉండి సహాయం కోసం అర్థించిన ప్రతీ ఒక్కరికీ ఆపన్న హస్తం అందించాడు సోను. తనను అడగకపోయినా సరే, కష్టం ఉందని తెలిసి చాలా మంది కన్నీళ్లు తుడిచాడు. లాక్‌డౌన్‌లో వలస కార్మికులను సొంత గూటికి చేర్చడం నుంచి విదేశాల్లో ఉన్న విద్యార్థులను అమ్మానాన్న దగ్గరికి చేర్చడం, వార్తల్లో కాడెద్దులుగా ఉన్న అక్కా చెల్లెళ్ళకు ట్రాక్టర్ పంపించడం, పొట్టకూటి కోసం వీధుల్లో తన వారియర్ స్కిల్స్ ప్రదర్శించిన వారియర్ ‘ఆజి’ని మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్‌గా నిలబెట్టడం వరకు.. ఇలా ప్రతీ ఒక్కరినీ ఆదుకునేందుకు ముందున్నాడు సోను.
ముఖ్యంగా తన పుట్టినరోజున 20 వేల మంది వలస కార్మికులకు ‘ప్రవాసీ రోజ్ గార్’ యాప్ ద్వారా ఉపాధి కల్పించనున్నట్లు తెలిపి ఈ తరానికి మహాపురుషుడు అనిపించుకున్నాడు. ఎన్ఏఈసీ ప్రెసిడెంట్ లలిత్ తుక్రల్ సహాయంతో నోయిడా పరిధిలోని ప్రైవేట్ సెక్టార్స్‌లో ఉద్యోగాలు ఇప్పించి, వారి పాలిట నిజంగా దేవుడైన సోను.. ఇప్పుడు మరో అనౌన్స్‌మెంట్ చేశాడు. ఈ 20 వేల మంది వలస కార్మికులకు ఇళ్లు కూడా కట్టిస్తానని మాటిచ్చాడు. ఇందుకోసం 24 గంటలు పనిచేస్తున్నట్లు చెప్పాడు.
https://www.instagram.com/p/CEQsCS-gl28/?igshid=mopw9887zmji
దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ ప్రశంసలతో నిండిపోయింది. బంగారం లాంటి మనసున్న సోనూ సూద్.. గొప్ప స్ఫూర్తిప్రదాత అని కొనియాడుతున్నారు నెటిజన్లు.