- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
22 మంది ప్రాణాలు కాపాడిన సోనుసూద్..
దిశ, సినిమా : రియల్ హీరో సోనుసూద్ లాక్‌డౌన్ హీరో అయ్యాడు. ఇప్పుడు పోతున్న ప్రాణాలను కాపాడి దేవుడయ్యాడు. కరోనా సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 24 గంటలు సేవలందిస్తున్న సోను.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని అరక్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యను క్షణాల్లో పరిష్కరించి 22 మంది ప్రాణాలను రక్షించాడు. విషయానికొస్తే.. బెంగళూరులోని హాస్పిటల్‌లో ఆక్సిజన్ సపోర్ట్‌తో 24 మంది రోగులకు చికిత్స కొనసాగుతోంది.
కానీ అప్పటికే ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఇందులో ఇద్దరు రోగులు మరణించారు. దీంతో చాలా చోట్ల ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రయత్నించిన పోలీస్ అధికారి.. చివరకు సోనుకు మెసేజ్ చేశారు. దీంతో క్షణాల్లో స్పందించిన టీమ్.. ఆక్సిజన్ సిలిండర్లను ఆస్పత్రికి చేర్చింది. ఏమాత్రం ఆలస్యం జరిగినా, వారి ప్రాణాలు పోయేవని.. అలర్ట్‌గా ఉంటూ సేవలందించిన తన టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు సోను. ఇలాంటి సేవలు కొనసాగించాలని అభినందించాడు.