పరీక్షా వాయిస్‌లో సోనియా నెగ్గేనా ?

by  |
పరీక్షా వాయిస్‌లో సోనియా నెగ్గేనా ?
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలతో సోనియాగాంధీ నేడు సమావేశం కానున్నారు. జేఈఈ, నీట్ పరీక్షలతోపాటు పలు ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ లో వారితో చర్చించనున్నారు. ఈ కాన్ఫరెన్స్ లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో పలువురు పాల్గొననున్నారు.

కాగా, కరోనా వ్యాపిస్తున్నందున జేఈఈ, నీట్ పరీక్షల వాయీదా అంశంపై గత కొద్ది రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలతోపాటు పలువురు కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. కానీ, కేంద్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. దీంతో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కరోనా విజృంభిస్తున్నందున పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. పరీక్షల నిర్వాహణపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది. పరీక్షల నిర్వహణను వాయిదా వేయబోమని, అనుకున్న విధంగా షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది.


Next Story

Most Viewed