- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసమ్మతి నేతలపై సోనియా ఉక్కుపాదం?
దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ వర్గాలలో అసమ్మతి లేఖతో తుఫాను రేపిన నేతలను కట్టడి చేసేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జైరామ్ రమేష్ ను చీఫ్ విప్ గా నియమిస్తున్నట్టు సమాచారం.
ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగుతున్న గులాం నబీ ఆజాద్, డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మలను పక్కన పెడుతూ… కాంగ్రెస్ పార్టీ కోశాధికారి, ఆమె రాజకీయ సలహాదారు అయిన అహ్మద్ పటేల్, ఆమెకు అత్యంత విధేయుడైన కెసి వేణుగోపాల్ కు రాజ్యసభ బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
సోనియా లోక్ సభలోనూ ఇదే తరహాలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. గౌరవ్ గొగోయ్ డిప్యూటీ లీడర్‌గా, రవ్నీత్ సింగ్ బిట్టును విప్‌గా నియమించనున్నట్టు అంతర్గత వర్గాల సమాచారం. కాగా లేఖ రాయడంలోనూ, ముఖ్య నేతలను సోనియా పక్షాన మాట్లాడకుండా గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలు కీలక పాత్ర పోషించారు.
అయితే ఇకమీదట పార్టీలో అసమ్మతి గళాలు వినిపించకుండా ఉండడానికి, ఆ నేతలను కట్టడి చేసేందుకే సోనియా గాంధీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.