- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొవిడ్‌పై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించండి – సోనియా గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు నాలుగు లక్షకు మించి నమోదవుతున్నాయని, ఈ మహమ్మారిని నిలువరించడంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్‌పై రాజకీయ పార్టీలకతీతంగా పోరు చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహమ్మారిని జయించాలంటే సమర్థుడైన, ముందుచూపు గలిగిన నాయకుడు అవసరమని.. కానీ, మోడీ ప్రభుత్వం కరోనా పరిస్థితులు హ్యాండిల్ చేయడంలో విఫలమైందని విమర్శలు చేశారు. సిస్టమ్ ఫెయిల్ కాలేదని, దేశ సామర్థ్యాన్ని, వనరులను సరైన మార్గంలో చేర్చి పోరాడటంలో మోడీ సర్కారు ఫెయిల్ అయిందని అన్నారు. వెంటిలేటర్లు, మెడిసిన్స్, ఆక్సిజన్ సప్లై చైన్‌ను బలోపేతం చేయడానికి నిరాకరించిందని, దేశంలోని డిమాండ్‌కు తగినట్టుగా సకాలంలో టీకాలు అందుబాటులో ఉంచేలా అనుగుణమైన ఆదేశాలను జారీ చేయలేకపోయిందని ఆరోపించారు.
కరోనా మహమ్మారిపై దీటుగా పోరడటానికి పార్లమెంటరీ ప్యానెల్‌లు కలెక్టివ్ యాక్షన్‌లు చేపట్టాలని వివరించారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా నిర్మాణంపై మాట్లాడుతూ, అత్యవసరం కాని ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నదని, అవి ప్రజల యోగక్షేమాలకు పనికిరావని తెలిపారు. ప్రజల సంక్షేమానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని, నేషనల్ టాస్క్ ఫోర్స్, పార్లమెంటరీ ప్యానెల్, ఈజీవోఎంల నుంచి వచ్చిన హెచ్చరికలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అసమానత్వ టీకా పంపిణీ ప్రణాళిక దళితులు, ఆదివాసీలు, ఓబీసీ, పేదలు, అణగారినవర్గాలను ఇమ్యునైజేషన్‌కు దూరం చేస్తుందని అన్నారు.
ఫలితాలను సమీక్షిస్తాం
ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అన్నారు. వీటిని ఊహించలేమని తెలిపారు. ఈ పరాజయం నుంచి తాము గుణపాఠాలు నేర్చుకుంటామని వివరించారు. ఈ ఫలితాలను త్వరలో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశంలో సమీక్షిస్తామని పేర్కొన్నారు.