రణ్ బీర్.. బోనఫైడ్ రాక్‌స్టార్ : సోనమ్

by  |
రణ్ బీర్.. బోనఫైడ్ రాక్‌స్టార్ : సోనమ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివా సోనమ్ కపూర్ తన ఫస్ట్ హీరో రణ్ బీర్ కపూర్‌కు బెస్ట్ విషెస్ అందించింది. 2007లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘సావరియా’ సినిమా ద్వారా సోనమ్, రణ్ బీర్ బాలీవుడ్‌కు పరిచయం కాగా.. ఆ తర్వాత సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ కొనసాగుతుండగా.. రణ్ బీర్ పుట్టినరోజు పురస్కరించుకుని సోనమ్ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఏడాది సూపర్ సక్సెస్‌తో దూసుకుపోవాలని కోరుకున్న సోనమ్.. ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌డే ఆర్‌కే’ అని తెలుపుతూ, నువ్వు నిజంగా కమ్యూనిటీ సర్టిఫైడ్ రాక్‌స్టార్ అని చెప్పింది. ప్రతీ విషయంలో మంచి జరగాలని కోరుకుంటూ.. సంజు సినిమాలో బడియా సాంగ్‌ను షేర్ చేసింది. బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ కూడా రణ్ బీర్‌కు ‘బేబీ బ్రో’ అంటూ విష్ చేసింది.

కాగా, రణ్ బీర్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్రం’ సినిమాతో బిజీగా ఉండగా.. ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాను థియేటర్స్‌లోనే రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు.


Next Story

Most Viewed