- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇక్కడ విజేత ఒక్కరే.. అది నేనే : సోనాక్షి
సోనాక్షి సిన్హా.. నెపోటిజం గురించి భారీ ట్రోల్స్ ఎదుర్కొన్న సెలబ్రిటీల్లో ఒకరు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత భారీ నెగెటివ్ కామెంట్లతో అల్లాడిపోయిన సోనాక్షి.. వీటన్నింటినీ తట్టుకోలేక తన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ ఘటన జరిగాక సోషల్ మీడియాలో తనపై మీమ్స్, ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇన్‌స్టాగ్రాంలో వీటన్నిటికీ సమాధానం చెప్తూ ఓ పోస్ట్ పెట్టింది సోనాక్షి.
ట్విట్టర్ నుంచి, అందులోని నెగెటివిటీ నుంచి బ్రేక్ తీసుకుంటే కొందరు.. వాళ్లేదో గెలిచినట్లు సంబరాలు చేసుకుంటున్నారన్న సోనాక్షి.. ‘మీకు అలా అనిపించింది కదా! అయితే సెలబ్రేషన్స్ చేసుకోండి.. నేను కూడా అందుకు హ్యాపీ. కానీ దీనివల్ల ఎవరికి ఎలాంటి మార్పు, హాని కలగదని’ చెప్పింది సోనా. తనను అవమానిస్తూ, అనవసరంగా బ్లేమ్ చేసే ప్రత్యక్ష మూలాన్ని కట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది. ‘నాతో పాటు నా స్నేహితులు, కుటుంబం గురించి మీకు ఇష్టం వచ్చిందల్లా మాట్లాడే మీ పవర్‌ను తీసేసుకున్నా.. నేను ఎంతో నమ్మకంగా మీకు ఇచ్చిన యాక్సెస్‌ను నిలబెట్టుకొలేకపోయారు. కాబట్టి ఇక్కడ విజేత ఒక్కరే.. అది నేను మాత్రమే’ అని చెప్పింది.
మీ నెగెటివిటీతో నాకు ఒరిగిందేమీ లేదు.. కానీ నేను పదేళ్లుగా సంపాదించిన 16 మిలియన్ల ఫాలోవర్స్‌ను ఒక్క వేలితో తీసేయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నేను నా హేటర్స్ గురించి కోరుకునేది ఒక్కటే.. ప్రేమ, స్వస్థత పొందాలి. ఒకవేళ మీరు ఇదే పద్ధతిలో కొనసాగుతామన్నా నాకు సమస్యేమీ లేదు.. మీరు నన్ను రీచ్ కాలేరు’ అని చెప్పింది. కానీ ఈ క్రమంలో తనను నిజంగా ప్రేమించే అభిమానులకు దూరం అయ్యానని.. వారంతా తమ ప్రేమను ఇతరులకు వ్యాప్తి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఎందుకంటే ప్రేమ ఒక్కటే అన్నిటికీ సమాధానం చెప్తుంది అన్నారు సోనాక్షి.