- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ కలహాలే..కొడుకుని అంతకు తెగించేలా చేశాయా!
దిశ, నిజామాబాద్: కూతరుపై ఓ తండ్రి ప్రేమ కాదు మోజు పెంచుకున్నాడు. ఆకతాయిల నుంచి రక్షణగా నిలవాల్సింది పోయి కూతురి పాలిట రాక్షసుడిలా మారాడు. తన కోరిక మాత్రం తీర్చాల్సిందే అంటూ రెండేళ్లుగా వేధించసాగాడు. అంతేకాదు, ఏకంగా కత్తితో బెదిరించి మరీ దారుణం చేయబోయాడు. రక్త సంబంధాలను మరిచిన అతడు చివరకు రక్త చరిత్రకు బలైయ్యాడు. చెల్లెలిపై అఘాయిత్యం చేయబోయాడన్న విషయాన్ని అన్నయ్య జీర్ణించుకోలేకపోయాడు. దీంతో తలకొరివి పెట్టేందుకు తండ్రి తలనరికాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం తిప్పపూర్‌లో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాళ్లోకి వెళితే.. తాటిపల్లి మేలయ్య( 50) తిప్పపూర్ గ్రామ పంచాయతీకి వార్డుమెంబర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు ప్రశాంత్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. కూతురు డిగ్రీ చదువుతోంది. మేలయ్య మాత్రం ఆటో నడుపుతూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తన కళ్లముందే ఎదుగుతున్న కూతురిపై కన్నేశాడు. కోరిక తీర్చాలని గత రెండేళ్లుగా వేధించసాగాడు. బుధవారం తన కొడుకు ఇంటి వద్ద లేకపోవడంతో మేలయ్య రెచ్చిపోయాడు. బుధవారం రాత్రి ఏకంగా కత్తి చేతపట్టుకొని కూతురిని బలవంత పెట్టాడు. తండ్రి వేధింపులు తాళలేక కూతురు జరిగిన విషయం అన్నయ్యకు తెలిపింది. దీంతో క్షణికావేశంలో ఇంటికి వచ్చిన కొడుకు తండ్రితో గొడవకు దిగాడు. దీంతో మేలయ్య గొడ్డలి తీసుకొచ్చి బెదిరింపులు చేశాడు. తండ్రి ప్రవర్తనను జీర్ణించుకోలేని ప్రశాంత్ అదే గొడ్డలి తీసుకొని తండ్రి తలపై ఓ వేటు వేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిన మేలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.