కన్నతల్లికి తలకొరివి పెట్టకుండా వెళ్లిపోయిన కొడుకు

by srinivas |
కన్నతల్లికి తలకొరివి పెట్టకుండా వెళ్లిపోయిన కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నతల్లికి తలకొరివి పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు ఓ కొడుకు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాజారత్నం అనే మహిళ మంగళవారం రాత్రి బంటుమిల్లులోని కూతురు ఇంటి వద్ద చనిపోయింది. దీంతో మృతదేహాన్ని కుమార్తె, అల్లుడు కలిసి బందరు తీసుకువచ్చారు. అయితే తాను మృతదేహాన్ని ఖననం చేయనంటూ మృతురాలి కొడుకు నాగప్రసాద్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. కాగా, నాగప్రసాద్ ఏఆర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తన అక్క, బావ డబ్బుల కోసం తన తల్లిని చంపారని నాగప్రసాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ జోక్యం చేసుకోవాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు.

Advertisement

Next Story