పరువు తీశాడని పగ పెంచుకున్న చింటు.. పడుకున్న పెద్దనాన్నపై..!

by Sumithra |   ( Updated:2021-06-22 12:06:29.0  )
పరువు తీశాడని పగ పెంచుకున్న చింటు.. పడుకున్న పెద్దనాన్నపై..!
X

దిశ, వనపర్తి : సెల్‌ఫోన్ ఎందుకు దొంగలించావని మందలించిన పెదనాన్నను బండరాయితో మోది హత్యచేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. రూరల్ ఎస్సై షఫీ కథనం ప్రకారం.. వనపర్తి మండలం నాగవరంలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న గుజ్జుల చందు(34) రెండు రోజుల కిందట ఇంట్లో పోచమ్మ పండుగను బంధు మిత్రులతో కలిసి జరుపుకున్నారు. పండుగలో గుజ్జుల చందు కుమారుడు సూరి సెల్‌ఫోన్ పోయిందని గమనించారు. కుటుంబ సభ్యులు చందు తమ్ముడి కొడుకు చింటూ అలియాస్ రమేష్ (17)తీసుకున్నాడని గుర్తించి.. అన్న సెల్‌ఫోన్ ఎందుకు దొంగిలించావు అని గుజ్జుల చందు తమ్ముని కొడుకు చింటును మందలించాడు.

అందరిముందు తనను మందలించాడని పెద్దనాన్నపై కోపం పెంచుకున్న చింటు.. మద్యం మత్తులో అదేరోజు రాత్రి ఆరు బయట ఒంటరిగా నిద్రిస్తున్న చందును బండరాయితో మోది హత్య చేశాడు. చింటూను పట్టుకునేందుకు ప్రయత్నించిన మృతుని మరదలు బాలమ్మను పక్కకు తోసేసి పారిపోయాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, పరారీలో ఉన్నా చింటు కోసం గాలిస్తున్నట్లు ఎస్సై షఫీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed