- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పు
దిశ, నల్లగొండ క్రైం : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన అల్లుడు మద్యం మత్తులో అత్తారింటికి నిప్పటించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన సైదులుకు, మర్రిగూడకు చెందిన సుమలతకు 10 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో మూడేండ్ల క్రితం సుమలత తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై సైదులు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో మర్రిగూడకు వెళ్లి అత్తగారింటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇంటిసామగ్రి, రెండు బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం వాటిల్లిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.