- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దారుణం.. కన్న తండ్రిపై కొడుకు యాసిడ్ దాడి
దిశ, పాలేరు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రిపైనే కొడుకు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం అగ్రహారం గ్రామానికి చెందిన దేవినేని సత్యనారాయణ(58) అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో రెండో కుమారుడైన రాధాకృష్ణకి, తండ్రి సత్యనారాయణకి మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఖమ్మంలో నివాసం ఉంటున్న రాధాకృష్ణ.. ఈ నెల 2న ద్విచక్ర వాహనంపై గ్రామానికి వచ్చి.. కార్ల రమేష్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో తన తండ్రి సత్యనారాయణపై బ్యాటరీల్లో వాడే యాసిడ్ పోసి పరారయ్యాడు. స్థానికులు వెంటనే సత్యనారాయణను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. బాధితుడి మనుమడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సత్యనారాయణ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.