సల్మాన్‌తో రిలేషన్స్ లేకుంటేనే మంచిది : హీరోయిన్

by Shyam |
సల్మాన్‌తో రిలేషన్స్ లేకుంటేనే మంచిది : హీరోయిన్
X

దిశ, సినిమా : పాకిస్తాన్ సంతతికి చెందిన మాజీ నటి సోమి అలీ.. తన డెబ్యూ మూవీ సల్మాన్ ఖాన్‌తో చేయాల్సింది. కానీ పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే సల్మాన్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్‌కు దారితీయడంతో వీరిద్దరూ దాదాపు ఎనిమిదేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. కాగా అప్పటి విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది సోమి. ఆ టైమ్‌లో హోమ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన సల్మాన్.. ‘బులంధ్’ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం తనను సంప్రదించారని, షూటింగ్ కోసం ఖాఠ్మండుకు కూడా వెళ్లామని, కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పింది. అప్పుడు తాను చాలా యంగ్ గర్ల్ అని చెప్పిన సోమి.. ప్రొడ్యూసర్స్‌తో సమస్యల కారణంగా చిత్రాన్ని పక్కనబెట్టారని వెల్లడించింది. ఇక తమ బంధం చిగురించేందుకు ఆ సినిమానే కారణమని తెలిపింది.

కాగా ప్రస్తుతం సల్మాన్‌తో రిలేషన్‌పై స్పందిస్తూ.. ‘ఐదేళ్ల నుంచి తనతో మాట్లాడలేదు, ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నాం. సైకలాజికల్‌గానూ అతనితో టచ్‌లో ఉండకపోవడమే నా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు తను ఉన్న పొజిషన్ పట్ల హ్యాపీగా ఉంది. అది చాలు’ అని వివరించింది. అంతేకాదు 1999 డిసెంబర్‌లో సల్మాన్‌తో తాను విడిపోయాక తనకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలియదని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed