- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఇదొక్కటి చాలు మీ పాలన తీరు చెప్పడానికి’
దిశ ఏపీబ్యూరో: దేశంలోని సర్వోన్నత న్యాయస్థానంలో సాక్షాత్తు చీఫ్ జస్టిస్ బెంచ్… ఏపీలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే మీ పాలన ఎలా ఉందో అర్థమవుతోంది అంటూ ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ట్విట్టర్ మాధ్యమంగా వీడియో విడుదల చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి .. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఏపీలో పాలన గాడితప్పిందని, రాజ్యాంగాన్ని విస్మరిస్తోందని రుజువైందని తెలిపారు.న్యాయ వ్యవస్థతో మాకు సంబంధం లేదు, రాజ్యాంగం మాకు అక్కర్లేదు అంటూ మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి ఇదేమీ నియంత పాలన కాదని ఆయన హితవు పలికారు. రాజ్యాంగబద్దంగా నడిచే ప్రజాస్వామ్య దేశం అని మర్చిపోవద్దని ఆయన సూచించారు.
అధికారులను ఉద్దేశించి.. పాలకులకు బానిసల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో కేసుల్లో తీర్పులు వస్తే జైలుకు వెళ్లేది అధికారులేనని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ నిర్ణయాలు తీసుకుంటే వాటిని కళ్లు మూసుకుని అమలు చేసే హక్కు అధికారులకు ఎవరిచ్చారని ఆయన నిలదీశారు.