- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ కేసుపై నటి షాకింగ్ కామెంట్స్.. ఆర్యన్ ఆ పని చేస్తే తప్పేంటి ?
దిశ, సినిమా : సీనియర్ హీరోయిన్ సోమీ అలీ.. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై స్పందించింది. ఈ విషయంలో ఆర్యన్‌కు సపోర్ట్ చేసిన సోమీ.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో డ్రగ్స్ తీసుకోవడంలో ఓన్ ఎక్స్‌పరిమెంట్స్ గురించి వివరించింది. ‘ఏ పిల్లోడు డ్రగ్స్ ట్రై చేయకుండా ఉంటాడు చెప్పండి? డ్రగ్స్, వ్యభిచారం ఒక్కటే అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి వాటిని చట్టవిరుద్ధం చేయాలి. ఇది చిన్నపిల్లల దృష్టాంతమే ఇక్కడ సాధువులెవరు’ అని తెలిపింది. అలాగే తను కూడా 15ఏళ్ల వయసులో ఆందోళన్ షూటింగ్ టైమ్‌లోనూ దివ్యభారతితో కలిసి డ్రగ్స్ తీసుకున్నానని, ఈ విషయంలో తనకెలాంటి రిగ్రెట్స్ లేవని చెప్పింది. ఇక ఎలాంటి కారణం లేకుండా ఆర్యన్ బాధపడుతున్నాడని నిరూపించేందుకు జ్యుడిషియల్ సిస్టెమ్ పని చేస్తుందనిపిస్తుందని, దీనికి రేపిస్టులు, హంతకులను పట్టుకోవడంలో ఫోకస్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. యూఎస్ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా 1971 నుంచి ఫైట్ చేస్తుంది కానీ వాటిని యూజ్ చేయాలనుకునే ఎవరికైనా ఇప్పటికీ సులభంగా అందుబాటులో ఉంటున్నాయని గుర్తుచేసింది. ఆర్యన్ తప్పుచేయలేదు కాబట్టి కచ్చితంగా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేసింది.