విక్రయానికి టిక్‌టాక్ మెజారిటీ వాటా

by  |
విక్రయానికి టిక్‌టాక్ మెజారిటీ వాటా
X

దిశ, వెబ్‌డెస్క్: వీలైనంత తొందరగా చైనా ముద్రను తొలగించుకునేందుకు సంచలన యాప్ టిక్‌టాక్ సిద్ధమవుతోంది. చైనాను దెబ్బ కొట్టేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు టిక్‌టాక్ కేంద్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తల పట్టుకుంటోంది. ఈ పరిస్థితుల్లో చైనా యాప్ అనే పేరును తొలగించుకునేందుకు మెజారిటీ వాటాను అమ్మాలని బైట్‌డ్యాన్స్ కంపెనీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బైట్‌డ్యాన్స్ కంపెనీ విలువ సుమారు 100 బిలియన్ డాలర్లకు పైనే ఉంది. ఇందులో సాఫ్ట్ బ్యాంక్, కేకేఆర్, జనరల్ అంట్లాంటిక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులను పెట్టాయి. ఇటీవల భారత ప్రభుత్వం దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం, సార్వభౌమత్వానికి భంగం కలిగేలా ఉందనే కారణంతో టిక్‌టాక్ హెలో యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా టిక్‌టాక్ యాప్‌ను నిషేధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరాయి. దీనిపై ఆలోచిస్తున్నామని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా తెలిపారు. ఇక, అమెరికా బాటలోనే ఆస్ట్రేలియా కూడా ఈ యాప్‌పై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. దీని గురించి ఆ దేశ మంత్రులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదీవరకే చైనాకు, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో నిషేధం తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చైనా ముద్రను తొలగించుకుంటే తప్ప మనుగడ కష్టమని భావించిన బైట్‌డ్యాన్స్ మెజారిటీ వాటాను విక్రయించి, ప్రధాన కార్యాలయాన్ని మరో చోటుకు మార్చడానికి సిద్ధమైంది.


Next Story

Most Viewed