- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పా చెరువుకు గండి.. దుండగుల దుశ్చర్యే!
అతివృష్టి నగరాన్ని అతలాకుతలం చేసింది. లక్షలాది మందికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. రూ.కోట్లల్లో ఆస్తులు నష్టపోయారు. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. రాకపోకలు నిలిచిపోయా యి. ఉపాధి దెబ్బతింది. ఇందులోనే ఓ సంఘటన మానవ ప్రమేయంతోనే జరిగిందని తెలిస్తే ఎలా ఉంటుంది? అవును నిజం. కొందరు కర్కోటకుల చేష్టలు ఐదు నిండు ప్రాణాలను బలిగొన్నాయని తెలుస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఓ చెరువు కట్టకు గండి కొట్టి తమ జాగాలను కాపాడుకోవాలని భావించినందునే ఈ ఘోరం జరిగిందని సమాచారం.
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 14న జోరు వానలతో హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ గగన్ పహాడ్ అప్పచెరువు నిండిపోయి ప్రమాదకరస్థాయికి చేరుకుంది. ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కలెక్టరు, ఇరిగేషన్, ఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బందితో సమీక్షించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా రాత్రి ఒంటిగంట నుంచి ఆరు గంటల మధ్య చెరువుకు గండి పడింది. వరదల్లో ఎనిమిది మంది గల్లంతయ్యారు. అమీర్ ఖాన్, కరీమాబేగం, సోహెల్, రమేష్, నల్లమోతు మాధవరావు ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
25 వాహనాలు ధ్వంసమయ్యా యి. ఇండ్లన్నీ ముంపునకు గురయ్యాయి. వేలాది మంది ఇబ్బంది పడ్డారు. అప్పటి వరకు బలంగానే ఉన్న కట్ట ఆకస్మాత్తుగా ఎందుకు తెగిపోయిందనే అనుమానం స్థానికులకు కలిగింది. ఆరా తీస్తే కొందరు అక్రమార్కులు తమ ఆస్తులను కాపాడుకోవడానికే ఈ ఘాతుకానికి ఒడిగట్టారని తేలింది. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని శంషాబాద్ ఆర్జీఐ పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కు, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చెరువుకు దిగువన పెద్దగా కాలనీలు లేవు. పల్లె చెరువు, మీర్ పేట చెరువు దిగువన ఉన్నట్లుగా కాలనీలు ఉంటే పదుల సంఖ్యలో జనం చనిపోయేవారు.
కబ్జాల కారణంగానే
నీటి పారుదల శాఖ నార్త్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్యాంకు గుడ్ కండిషన్ లోనే ఉందని, చరిత్రలో ఎప్పుడూ గండిపడలేదని నివేదిక సమర్పించారు. పక్కనే ఉన్న ఫ్యాక్టరీలు, ఇతర నిర్మాణాల యజమానులు వాళ్లకు నష్టం కలగకుండా ఏదైనా చేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. చెరువు కూడా కబ్జాకు గురైందని నిర్ధారించారు. కొందరు చెరువును కబ్జా చేసి వాణిజ్య భవనాలను నిర్మించినట్లు స్పష్టమైంది. ఇంకా కొందరు కబ్జాకు యత్నిస్తున్నట్లూ తేలింది. వారే చెరువును ధ్వంసం చేసినట్లు అనుమా నించారు.
దీంతో ఈ అంశం మీద సమగ్ర దర్యాప్తు చేయాలని ఆర్డీఓ చంద్రకళ పోలీసులను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొందరు ప్రజాప్రతినిధులు చెరువులో అక్రమ నిర్మాణాలు లేవ న్నారు. ఆర్డీఓ చంద్రకళ నేతృత్వంలోనే ఎఫ్ టీఎల్ పరిధిలోని 12 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఇంకా అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. పల్లె చెరువు విషయంలోనూ ఎలాంటి అక్రమ నిర్మా ణాలు లేవని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రకటించిన ఉదంతాలను జనం గుర్తు చేస్తున్నారు. రాజకీయ అండదండలు ఉన్నోళ్లే ఆక్రమించుకోవడం, ఇతరులకు విక్రయించడం వంటివి చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.
అక్రమంగా వాణిజ్య భవనాలు
కాటేదాన్ చెంతనే అప్ప చెరువు ఉంది. చెరువులో ఎక్కువగా నీళ్లొస్తే కార్ఖానాలకు తీవ్ర అవరోధం కలుగుతుంది. ఎఫ్ టీఎల్ పరిధిలోనే పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు ఉన్నాయి. రూ.కోట్లు విలువజేసే స్థలాలు నీట మునగడాన్ని వారు జీర్ణించుకోలేదు. ఇప్పటికే చాలా వరకు గోడౌన్లు నిర్మించుకున్నారు. ఇంకొందరేమో ప్రహరీలు నిర్మించారు. కమర్షియల్ భవనాలు కట్టారు. ఎలాంటి అనుమతులు లేవు. ఇత జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఎఫ్ టీఎల్ పరిధిలో ఓ కార్పొరేటర్, ఆయన అనుచరుడికి కూడా స్థలాలు ఉన్నట్లు సమాచారం. చెరువుకు గండి కొట్టిన వాళ్ల కంటే, కొట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఐదు ప్రాణాలను బలిగొన్న వారిని ఉపేక్షించొద్దని వేడుకుంటున్నారు.