- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వార్తల్లో వాస్తవం లేదు: సోమారపు
దిశ ప్రతినిధి, కరీంనగర్ : తాను బీజేపీని వీడుతున్నానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అలాంటి వార్తలు రాసేప్పుడు జర్నలిస్టులు కూడా తనతో మాట్లాడాలని కోరారు. క్రమశిక్షణ కలిగిన బీజేపీ నాయకత్వం తీసుకున్ననిర్ణయానికి అనుగుణంగా పనిచేస్తామన్నారు. బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే వారితో కలిసి పనిచేస్తామని, ఇటీవల అంతర్గత విషయాలపై కొంతమంది ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని, ఇది సమంజసం కాదని అన్నారు.
ఎడమ కాలి చెప్పుతో సమానమైన పోస్టు అన్న సీఎం కేసీఆర్… ఆ కుర్చిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకును సీఎం చేస్తానన్న సంకేతాలు పంపించడం వల్లే పార్టీలో లుకలుకలు ప్రారంభం అయ్యాయని సోమారపు అన్నారు. పదేండ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటానని సీఎం అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఐదేండ్లకోసారి ఎన్నికలు జరుగుతాయన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.