- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అస్థిపంజరానికి ఆసరా.. రూ.8 కోట్ల పెన్షన్ తీసుకున్న కుటుంబ సభ్యులు
దిశ,వెబ్‌డెస్క్: మనకు తెలిసి పెన్షన్ అంటే 60 ఏళ్లు పైబడి జీవించి ఉన్న వారికి ఆసరా వయస్సు దృష్ట్యా పెన్షన్ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ అస్థిపంజరానికి 30 ఏళ్లుగా పెన్షన్ ఇస్తూనే ఉన్నారు. ఆ 30 ఏళ్లకు గాను ఇచ్చిన పెన్షన్ ఎంతయా అంటే అక్షరాల రూ.8 కోట్లు. మీరనుకోవచ్చు బ్రతికి ఉన్నవాళ్లకే సరిగ్గా పెన్షన్ రావడం లేదని, అలాంటిది ఓ అస్థిపంజరానికి రూ.8కోట్ల పెన్షన్ ఎలా ఇస్తారని?
జపాన్ టోక్యోలో అడాచి అనే ప్రాంతంలో సోగెన్ కటో అనే వ్యక్తికి 111వ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలని అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. ఇంట్లో సోగెన్ కటో మనవరాలితో ఈ రోజుల్లో 60-70 ఏళ్లు బ్రతకడం చాలా కష్టం అలాంటిది మీ తాత ఈ రోజుతో 111వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అది తెలుసుకొని విషెస్ చెప్పాలని వచ్చాం. ఒక్కసారి మీ తాత ఎక్కడున్నాడో చెప్పండి. విష్ చేసి వెళతామని అధికారులు కోరారు. దీంతో కంగారు పడ్డ ఆయన మనవరాలు.., మా తాత ఎవరినీ చూడాలని అనుకోవడం లేదంటూ వారిని ఇంటి నుంచి పంపించేసింది.
దీంతో అనుమానం వచ్చిన స్థానిక ప్రభుత్వ అధికారి టొమోకో ఇవామాట్సు పోలీసులకు సమాచారం అందించారు. సోగెన్ కటో 111వ పుట్టిన రోజున విషెస్ చెప్పాలని ఇంటికి వెళితే, కుటుంబసభ్యులు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. మాకేదో అనుమానంగా ఉందంటూ ఫిర్యాదు చేశారు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సోగెన్ కటో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సోఫాసెట్ పై దుప్పటి కప్పుకొని ఉన్న మనిషి ఆకారం కనిపించింది. వెంటనే పోలీసులు సోఫాలో పడుకుంది సోగెన్ కటో అని భావించారు. అతన్ని లేపేందుకు మొహం మీద ఉన్న దుప్పటిని పక్కకి లాగారు. సోఫాలో ఉన్న ఆకారాన్ని చూసి కంగుతిన్నారు. ఎందుకంటే సోఫాలో ఉంది సోగెన్ కటో అస్థిపంజరం. అస్థిపంజరానికి లోదుస్తులు, పైజామా ధరించి దుప్పటితో ముసుగేసి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో సోగెన్ కటో చనిపోయి 30ఏళ్లు అవుతుందని, కానీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు టోక్యో మెట్రోపాలిటన్ సంక్షేమ అధికారి యుటాకా మురోయ్ తెలిపారు. సోగెన్ చనిపోయినా 30ఏళ్ల నుంచి పెన్షన్ తీసుకుంటున్నారని, ఇప్పటివరకు అలా రూ.8 కోట్ల దాకా సోగెన్ కుటుంబ సభ్యులు తీసుకున్నట్లు మెట్రోపాలిటన్ సంక్షేమ అధికారి యుటాకా మురోయ్ వెల్లడించారు.