హోలీ వేడుకల్లో హీరోయిన్ స్కర్ట్‌పైకి లేపిన ఫ్యాన్

by Shyam |
Sofiya Hayat
X

దిశ, సినిమా: హోలీ సెలబ్రేషన్స్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది యాక్ట్రెస్ సోఫియా హయత్. గతంలో తనకు జరిగిన అనుభవాన్ని షేర్ చేస్తూ.. ఇలాంటి సందర్భాల్లో మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలని చెప్తోంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించిన సోఫియా..నార్మల్‌గా బయటకు వెళ్లినప్పుడు, ఫంక్షన్స్‌కు అటెండ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని తెలిపింది.

అయితే ఆ రోజు హోలీ పార్టీలో పానీపూరి తిన్నానని, అందులో బంగ్ కలిపిన విషయం తనకు తెలియదని వివరించింది. దీంతో ఆ మత్తులో ఆనందంగా ఉన్నానని, అభిమానులు అందరితో ఫొటోలు దిగేందుకు ఇంట్రెస్ట్ చూపించానని చెప్పింది. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి తన స్కర్ట్‌పై చేయి వేసి పైకి లేపేందుకు ట్రై చేశాడని తెలిపింది. ముందుగా క్యాజువల్‌గా స్కర్ట్‌ను టచ్ చేశాడేమో అనుకున్నానని, రెండో సారి కూడా అలాగే రిపీట్ చేయడంతో చెస్ట్‌పై గట్టిగా కొట్టి నెట్టేశానని వివరించింది. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ తనను కారు దగ్గరికి తీసుకెళ్లాడని, అక్కడ నుంచి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలని చెప్పాడని తెలిపింది. ఆ జర్నలిస్ట్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానంది సోఫియా.

Advertisement

Next Story

Most Viewed