- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS VS BJP.. సోషల్ మీడియా వార్ @హుజురాబాద్
దిశప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో సోషల్ మీడియా వార్ అప్పుడే మొదలైనట్టుగా ఉంది. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు, పొలిటికల్‌గా దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు వ్యూహం రచించుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్న పరిస్థితి నెలకొనగా శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ లేఖ కలకలం సృష్టించింది. దీనికి కౌంటర్‌గా ఈటల వర్గీయులు కూడా టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. మీరు ఫేక్ లెటర్ ఒక్కటి క్రియేట్ చేస్తే మేం వంద క్రియేట్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో హుజురాబాద్‌లో సోషల్ మీడియా కేంద్రంగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకోవడం ప్రారంభించినట్టు స్పష్టంఅవుతోంది. ఇప్పటి వరకు మీడియా ముందు పరస్పర విమర్శలు మాత్రమే చేసుకున్న ఆయా పార్టీలు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశాయి. తనను క్షమించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు రాసినట్లు లేఖ విడుదలవ్వడంపై ఈటల మండిపడటమే కాకుండా, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, వీణవంకకు చెందిన నాయకులు కూడా స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.
నిన్న మొన్నటి వరకు రాజకీయంగా ఎత్తుగడలు, ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ముందుకు సాగిన లీడర్లు ఇప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకునే స్థాయికి చేరారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇలాంటి పరిస్థితి తయారైతే ఎలక్షన్ సమీపించే నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ హుజురాబాద్‌లో జోరుగా సాగుతోంది. ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీలు వేస్తున్న కొత్త ఎత్తుగడల ప్రభావం ఎక్కడికి దారితీస్తుందోనని అనేవారు లేకపోలేదు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియా వేదికగా జరిగిన ట్రోల్స్ పై కేసులు కూడా నమోదయ్యాయి. రానున్న కాలంలో హుజురాబాద్‌లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే చాన్స్ లేకపోలేదు. అయితే, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభిమానిని పోలీసులు అరెస్ట్ చేయగా.. హుజురాబాద్‌లో విపక్ష పార్టీ నాయకుల ఫిర్యాదుపై పోలీసులు అధికార పార్టీ నేతలపై ఎలాంటి చర్యలకు పూనుకుంటారో అన్న ఆలోచనలో హుజురాబాద్ ప్రజలు ఉన్నారు.