- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనాపై ఫేక్ న్యూస్‌తో ప్రజల్ని చంపుతున్నారు’
వాషింగ్టన్: కరోనా వైరస్, వ్యాక్సినేషన్‌పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తూ ప్రజల్ని చంపుతున్నారంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్‌పై ఫేస్‌బుక్ మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘మనకున్న మహమ్మారి టీకా తీసుకోనివారి మధ్యే ఉంది. వారేకాకుండా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిచేసేవారూ ప్రజల్ని చంపేస్తున్నారు’ అని వైట్‌హౌస్ ముందు మీడియాకు వెల్లడించారు. కాగా, ఫేక్ న్యూస్ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిదంటూ యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతి రోజే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా, తప్పుడు సమాచారాన్ని తొలగించడంలో, ఫ్లాగ్ చేయడంలో మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా సంస్థలకు వైట్‌హౌస్ ఆదేశించింది.
వారంలో 70శాతం పెరిగిన కేసులు
అమెరికాలో డెల్టా వేరియంట్ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకోనివారిలో మరణాల పెరుగుదలకు ఈ వేరియంట్ కారణమవుతున్నదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా రోగుల్లో 97శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉంటున్నారని వివరించింది. యూఎస్‌లో అంతకుముందు వారంతో పోలిస్తే ఈ వారంలో కేసులు 70శాతం, మరణాలు 26శాతం పెరిగాయని తెలిపింది. ఇవి కూడా వ్యాక్సినేషన్ తక్కువగా ప్రాంతాల నుంచి అధికంగా ఉన్నట్టు పేర్కొంది.