- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వయోవృద్ధులకు డిజిటల్ పాఠాలు.. ద సోషల్ పాఠశాల
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పుడు సెల్ఫీ తీసుకోవడం, వాట్సాప్‌లో మెసేజ్ చేయడం, ఫుడ్ లేదా మెడిసిన్స్ ఆర్డర్ చేసుకోవడం, క్యాబ్ బుక్ చేసుకోవడం వంటి పనులన్నీ స్మార్ట్‌ఫోన్ ఉంటేనే చేయగలుగుతున్నాం. అయితే స్మార్ట్‌ఫోన్ ఉండగానే సరిపోదు, దాన్ని ఆపరేట్ చేయడం రావాలి. ఇప్పటి పిల్లలు దాన్ని ఆపరేట్ చేయడం కడుపులో ఉండగానే నేర్చుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం. కానీ సీనియర్ సిటిజన్ల సంగతేంటి? వారితో వీడియో కాల్ మాట్లాడటానికి వీలుగా ఒక స్మార్ట్‌ఫోన్ అయితే పిల్లలు కొనిస్తున్నారు. మరి అదే చేత్తో వారికి దానితో చేయగల బేసిక్ పనులు నేర్పించడానికి మాత్రం పిల్లల దగ్గర సమయం ఉండదు. లాక్‌డౌన్‌లో ‘హెల్ప్‌ఏజ్ ఇండియా’ అనే స్వచ్చంద సంస్థ చేసిన సర్వేలో దీని గురించి కొన్ని నిజాలు బయటపడ్డాయి. మొత్తం 8 రాష్ట్రాల్లో 1580 మంది సీనియర్ సిటిజన్స్ ఈ సర్వేలో పాల్గొన్నారు.
వారిలో 47 శాతం మంది స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ తామే స్వయంగా నేర్చుకున్నామని తెలపగా, 25 శాతం మందికి తమ కుమారులు నేర్పించారని, 18 శాతం మంది తమ కుమార్తెలు నేర్పించారని చెప్పారు. ఈ లెక్కన చూస్తే స్మార్ట్‌ఫోన్ ఉన్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక, ఇతరుల మీద ఆధారపడుతున్న వయోవృద్ధులు ఎందరో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ముంబైకి చెందిన మహిమా భలోతియా కూడా అచ్చం ఇలాగే ఆలోచించింది. ఎలాగూ కొవిడ్ కారణంగా తన ఉద్యోగం పోయింది కాబట్టి ఇలాంటి సీనియర్ సిటిజన్స్‌కు డిజిటల్ పాఠాలు నేర్పించాలనే ఉద్దేశంతో ‘ద సోషల్ పాఠశాల’ను ప్రారంభించింది. జూమ్ వీడియోకాల్ ద్వారా నడిచే ఈ పాఠశాలలో విద్యార్థులందరూ 45 ఏళ్లకు పైబడిన వారే. జూమ్ పాఠాల ద్వారా ఈమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి? బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఎలా చేయాలి, సోషల్ మీడియా ఎలా బ్రౌజ్ చేయాలి వంటి బేసిక్ సోషల్ మీడియా పాఠాలను 26 ఏళ్ల మహిమా భలోతియా నేర్పిస్తోంది. సాధారణంగా ఇలాంటి పాఠాలను నేరుగా వెళ్లి చెబితేనే సీనియర్ సిటిజన్స్‌కు సరిగా అర్థం కావు, అలాంటిది జూమ్ వీడియో ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే చాలా ఓపిక ఉండాలి. తన కుటుంబం, స్నేహితులు ఎంకరేజ్ చేయడం వల్ల తాను ఓపికగా, ఇష్టంగా డిజిటల్ పాఠాలు చెప్పగలుగుతున్నానని మహిమా అంటోంది.