- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాకలో దుమ్ములేపిన సోషల్ మీడియా
దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉపఎన్నిక జరిగిన తీరు.. రానున్నరోజుల్లో ఎన్నికలు ఎలా సాగుతాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పిందా.. అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. సెల్‌ఫోన్ల వాడకం పెరగడం, 24గంటలు ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో సోషల్ మీడియాలో పోల్ మేనేజ్‌మెంట్ ఎంతలా చేయొచ్చన్నది స్పష్టం చేసింది. అంతేగాక సోషల్ మీడియా ప్రభావం.. ఎన్నిక మీద, పోలింగ్‌పై ఏవిధంగా ఉంటుందనేది రాజకీయ పార్టీలకు తెలిసొచ్చేలా నిరూపించింది.
ఎన్నికల ఫలితాల్లోనూ హల్‌చల్
ఇన్నిరోజుల ఉపఎన్నికపై దుమ్ములేపిన సోషల్ మీడియా.. ఇప్పుడు ఫలితాల విషయంలోనూ అదే రేంజ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతూ తమ పార్టీ గెలుస్తుందంటే.. తమ పార్టీనే గెలుస్తోందని రచ్చ రచ్చ చేస్తున్నాయి. పలు సంస్థలు ప్రకటించిన ఫలితాలను సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నాయి. ఇదేక్రమంలో ప్రత్యర్థి పార్టీ ఓడిపోతుందన్న పోస్టులను సైతం ఓరేంజ్‌లో ప్రచారం చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో వచ్చే అంశాలు వాస్తవమా.. కాదా అన్నది ఎవరికీ అర్థం కాదు. దీనివల్ల దుష్ప్రభావం ఎంత ఉంటుందో తాజాగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ఫలితాలపై టెన్షన్ పడుతున్నారు.