సామాజిక దూరం వల్ల లాభమే… అధ్యయనంలో వెల్లడి

by sudharani |
సామాజిక దూరం వల్ల లాభమే… అధ్యయనంలో వెల్లడి
X

దిశ, వెబ్‌డెస్క్: సామాజిక దూరం పాటిస్తూ ఎవరి ఇళ్లలో వారు ఉండటం వల్ల ఏం లాభముందని పెదవి విరుస్తున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే నిన్నటి వరకు నోటి ద్వారా సమాధానాలు చెప్పిన అధికారుల మాటలకు ఇప్పుడు ఓ అధ్యయనం తోడుగా నిలిచింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ వారు చైనాలో సామాజిక దూరం పాటించడం వల్ల కలిగిన లాభాల గురించి అధ్యయనం చేసింది.

వుహాన్‌లో పాఠశాలలు, కార్యాలయాలు మూసేయడం వల్ల కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని ఈ అధ్యయనంలో తేలింది. తాము తయారు చేసిన మేథమెటిక్ మోడలింగ్ సాయంతో సామాజిక దూరం ఎప్పటిదాక పాటిస్తే మంచిదో కూడా వారు తెలియజేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను మార్చి చివరిలోగా తీసేస్తే మళ్లీ ఆగస్టులో ఈ వైరస్ కేసులు బయటపడే అవకాశం ఉన్నట్లు నివేదికలో చెప్పారు. కాబట్టి ఈ సామాజిక దూరాన్ని ఏప్రిల్ వరకు కొనసాగించగలిగితే అక్టోబర్ వరకు వైరస్ ప్రభావాన్ని అడ్డుకునే అవకాశముందని పరిశోధకులు సలహా ఇచ్చారు.

గడచిన 24 గంటల్లో వుహాన్‌లో కొత్త కరోనా కేసు నమోదు కాలేదు. అంతేకాకుండా ఏప్రిల్ 8న చైనా ప్రభుత్వం అక్కడి లాక్‌డౌన్ కూడా తొలగించాలనుకుంటోంది. అలాగే మూడు నెలల పాటు హుబై ప్రావిన్స్‌లో విధించిన మూడు నెలల నిషేధాన్ని కూడా తొలగించేందుకు చైనా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనాభా విషయంలో చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారతదేశంలో 21 రోజుల క్వారంటైన్ వల్ల లాభాలు మరిన్ని ఉండొచ్చని అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ యాంగ్ లియు తెలిపారు.

tags : Corona, COVID 19, Social distance, Quarantine, Study, China, Wuhan

Advertisement

Next Story

Most Viewed