పాయింట్ల పట్టికలో వెనుకబడిన మందాన

by Shiva |   ( Updated:2021-03-02 12:04:36.0  )
పాయింట్ల పట్టికలో వెనుకబడిన మందాన
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మందాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రేటింగ్ పాయింట్లు కోల్పోయింది. దీంతో ఆమె బ్యాటర్ల విభాగంలో రెండు స్థానాలు జారి 6వ స్థానానికి చేరుకున్నది. మంధాన 732 పాయింట్లతో ఆరవ స్థానంలో స్థిరపడింది. ఇక సీనియర్ క్రికెటర్, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ 9వ స్థానంలో కొనసాగుతున్నది. టాప్ 10లో టీమ్ ఇండియాకు చెందిన వీరిద్దరే ఉన్నారు. ఇక బౌలర్లలో జులన్ గోస్వామి 5వ స్థానంలోనే కొనసాగుతున్నది. టాప్ టెన్‌లో గోస్వామి (691)తో పాటు పూనమ్ యాదవ్ (679), శిఖా పాండే (675) కొనసాగుతున్నారు. ఐసీసీ టాప్ వన్డే బ్యాటర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన టామీ బ్యూమోంట్, రెండవ స్థానంలో మెగ్ లాన్నింగ్స్ ఉన్నారు. బౌలర్లలో ఆస్ట్రేలియాకు చెందిన జెస్ జోనాస్సెన్ అగ్రస్థానంలో ఉన్నది.

టాప్ 5 ర్యాంకులు

బ్యాటర్స్
1. టామీ బ్యూమోంట్ – 765 (ఇంగ్లాండ్)
2. మెగ్ లాన్నింగ్ – 749 (ఆస్ట్రేలియా)
3. స్టెఫానీ టేలర్ – 746 (వెస్టిండీస్)
4. అలీసా హీలీ – 741 (ఆస్ట్రేలియా)
5. ఆమీ సాట్టర్‌వైట్ – 740 (న్యూజీలాండ్)

బౌలర్లు
1. జెస్ జోనాస్సెన్ – 804 (ఆస్ట్రేలియా)
2. మేగన్ షట్ – 735 (ఆస్ట్రేలియా)
3. మరిజాన్నే కాప్ – 711 (సౌత్ఆఫ్రికా)
4. షబ్నిమ్ ఇస్మాయేల్ – 708 (సౌత్ఆఫ్రికా)
5. జులన్ గోస్వామీ – 691 (ఇండియా)

ఆల్‌రౌండర్లు
1. ఎల్లీస్ పెర్రీ – 460 (ఆస్ట్రేలియా)
2. స్టెఫానీ టేలర్ – 410 (వెస్టిండీస్)
3. మరిజాన్నే కాప్ – 396 (సౌత్ఆఫ్రికా)
4. దీప్తి శర్మ – 359 (ఇండియా)
5. నటాలీ శివర్ – 349 (ఇంగ్లాండ్)

Advertisement

Next Story

Most Viewed