మహిళలు నిర్ణయించుకోలేరా..?

by Ramesh Goud |
మహిళలు నిర్ణయించుకోలేరా..?
X

ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో మీ ఇంట్లో మగవారితో చర్చించండని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మహిళలకు విజ్ఞప్తి చేస్తూ చేసిన ట్వీట్ బెడిసికొట్టింది. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా స్పందించారు. ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే సామర్థ్యం ఢిల్లీ మహిళలకు లేదా అంటూ ట్విటర్ వేదికగా కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. పలువురు మహిళలు కూడా కేజ్రీవాల్ ట్వీట్‌ను వ్యతిరేకిస్తూ.. ఆప్‌ను మహిళా వ్యతిరేక పార్టీ’గా అభివర్ణించారు. అయితే స్మృతి ఇరానీ ట్వీట్‌కు స్పందించిన కేజ్రీవాల్ ‘ఢిల్లీ మహిళలు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నారని’ బదులిచ్చారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో తమ కుటుంబమంతా ఎవరికి ఓటేయాలో మహిళలే నిర్ణయించారని తెలుపుతూ సమస్యకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు.

Advertisement

Next Story

Most Viewed