- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో జనవరి-మార్చి మధ్య కాలంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిని తాకే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లలో మొదటి త్రైమాసికాల్లో నమోదైన దానికంటే అత్యధికంగా విక్రయాలు ఉండనున్నాయని మార్కెట్ రీసెర్చ్ కంపెనీలు పేర్కొన్నాయి. జనవరిలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 1.2 కోట్లను దాటాయి. ఇది గడిచిన ఐదేళ్లలో మెరుగైన అమ్మకాలుగా నిలిచింది.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్ విక్రయాలకు డిమాండ్ తగ్గలేదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 33-35 లక్షల యూనిట్ల స్థాయిలో నమోదవనున్నట్టు పరిశోధనా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘రిపబ్లిక్ డే అమ్మకాల సమయంలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లతో పాటు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి రావడంతో జనవరిలో వృద్ధి ఊపందుకుందని’ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెప్పారు. జనవరి-మార్చి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగే అవకాశముందని ఆయన వెల్లడించారు.