‘సానుకూల వృద్ధిని తోసిపుచ్చలేం’

by  |
‘సానుకూల వృద్ధిని తోసిపుచ్చలేం’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రేరిత లాక్‌డౌన్ ఉన్నప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయం, అవసరమైన వస్తువులు, సేవలు పూర్తీగా పనిచేస్తున్నందున కొంత సానుకూల వృద్ధి ఉన్నదనే విషయాన్ని తోసి పుచ్చలేమని మాజీ ఆర్‌బీఐ గవర్నర్ సి రంగరాజన్ ఓ పత్రంలో పేర్కొన్నారు. రంగరాజన్, ఇండియా ఈవై చీఫ్ పాలసీ సలహాదారు డి కె శ్రీవాస్తవ రచయితలుగా ‘ మహమ్మారి నుంచి ఉద్భవించిన భారతదేశం యొక్క వృద్ధి అవకాశాలు, విధాన ఎంపికలు’ అనే పత్రంలో కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ గురించి పలు అంశాలను వెల్లడించారు.

ప్రపంచ బ్యాంకు 3.2 శాతం నుంచి ఎస్‌బీఐ 6.8 శాతం వరకు పలు జాతీయ, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు 2020-21 లో భారత జీడీపీ పదునైన సంకోచాన్ని అంచనా వేసినప్పటికీ, అంచనాల కంటే మెరుగైన ఫలితాలుంటాయని నమ్మేందుకు కారణాలున్నాయని తెలిపారు. ఆరోగ్య సేవలకు డిమాండ్ ఏర్పడిన సమయంలో వ్యవసాయం, సంబంధిత రంగాలు, పరిపాలనా విభాగాలు, రక్షణ సేవలు, ఇతర సేవల వంటి కీలక రంగాలు సాధారణం కంటే మెరుగ్గా పనిచేశాయని పత్రంలో తెలిపారు.

ఇతర రంగాల్లో అత్యవసర వస్తువులు, సేవలు వంటి రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ పూర్తీస్థాయిలో పనిచేశాయి. అందువల్ల, ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం రంగాలు 2020-21లో సాధారణం కంటే మెరుగైన పనితీరును కనబరుస్తాయని పత్రంలో పేర్కొన్నారు. 2019-20లో కార్పొరేట్ పన్ను రేట్లలో సంస్కరణలు వివిధ ఉత్పత్తి ప్లాట్‌ఫామ్‌లు కూడా మార్పుకు దోహదపడతాయని చెప్పారు. ఈ కారణాల నేపథ్యంలో కొంత సానుకూల వృద్ధిని తోసిపుచ్చలేమని రంగరాజన్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed