- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఢిల్లీలో తెరుచుకోనున్న స్కూళ్లు – డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా
దిశ వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే నెల 1 నుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా వెల్లడించారు. కాగా, గతేడాది మార్చిలో మొదలైన కరోనా తొలివేవ్‌తో దేశంలోని విద్యాసంస్థలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం సైతం స్కూళ్లను మూసివేసింది. తొలివేవ్‌లో కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ఈ ఏడాది ఫిబ్రవరి 5న పున:ప్రారంభించింది.
అయితే, అంతలోనే సెకండ్ వేవ్ రావడంతో ఏప్రిల్ 9న మళ్లీ మూసివేసింది. అప్పుడు మూతబడిన స్కూళ్లు ఇప్పటిదాకా తెరుచుకోలేదు. తాజాగా, ఢిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే నెల 1నుంచి విద్యాసంస్థలు తెరవాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మనీశ్ సిసోడియా వెల్లడించారు. విద్యార్థుల తప్పనిసరిగా హాజరుకావాల్సిన పాఠశాలలకు హాజరుకావల్సిన అవసరం లేదని, తల్లిదండ్రుల సమ్మతితో రావాల్సి ఉంటుందని తెలిపారు.
పాఠశాలకు రాని విద్యార్థులకు గైర్హాజరు వేయబోమని తెలిపారు. అలాగే, ఆన్‌లైన్ క్లాసులు సైతం అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు. కరోనా నిబంధనల నడుమ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో గురువారం 45కొత్త కేసులు వెలుగు చూడగా, మరణాలేవీ నమోదు కాలేదు. యాక్టివ్ కేసులు 413 ఉన్నాయి.