- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో నెమ్మదించిన పోలింగ్
దిశ ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొవిడ్ వైరస్ విజృంభణ, ఎండల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో ఓటర్లు ఓటెయ్యడానికి ముందుకు రావడం లేదు. ఉదయం సమయంలో కాస్త ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా 43 వార్డుల్లో కలిపి 46.79 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి చాలా పోలింగ్ కేంద్రాలు ఓటర్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరో రెండు గంటల పాటు ఇలాగే కొనసాగితే 50 శాతం దాటడం కూడా కష్టమే నంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. కాగా పలు వార్డుల్లో అభ్యర్థులు, ఎన్నికల అధికారులు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. సిద్దిపేట లో 144 సెక్షన్ అమల్లో ఉన్న అది అమలైనట్టు ఎక్కడ కన్పించడం లేదు. పోలీసులు చూస్తుండగానే ఓటర్లను ఆటోల్లో పదుల సంఖ్యలో తీసుకువస్తున్నారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.