వరంగల్‌లో ఆరు కరోనా కేసులు

by vinod kumar |
వరంగల్‌లో ఆరు కరోనా కేసులు
X

దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో మూడు, వరంగల్ రూరల్ జిల్లాలో మూడు కేసులు నిర్ధారించినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతామని తీర్మానం చేశారు. ఆదివారం మాత్రం అన్ని దుకాణాలు బంద్ ఉంటాయని, మాంసాహారం, కూరగాయల దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి వుంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా ములుగు పోలీస్ స్టేషన్‌లో వ్యాపారస్తులకు ఏఎస్పీ సాయి చైతన్య, సీఐ, దేవేందర్ రెడ్డి, ఎస్ఐలు బండారి రాజు, ఫణి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story