- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలిపిరిలో కిడ్నాపైన సాహూ క్షేమం
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన శివమ్ కుమార్ సాహు(6) కిడ్నాప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బాలుడుని కిడ్నాపర్ క్షేమంగా విడిచిపెట్టాడు. ఫిబ్రవరి 27న చిత్తూరు జిల్లాలోని అలిపిరిలో బాలుడిని అపహరించిన కిడ్నాపర్.. ఇవాళ విజయవాడలోని దుర్గ గుడి వద్ద బాలుడిని వదిలిపెట్టి పరారయ్యాడు. బాలుడిని చూసిన పోలీసులు చైల్డ్ హోమ్ కు తరలించారు. బాలుడు సాహు తమ వద్ద ఉన్నట్లు అలిపిరి పోలీసులకు విజయవాడ పోలీసులు సమాచారం ఇచ్చారు. అటు బాలుడి తల్లిదండ్రులకు సైతం సమాచారం అందించారు.
ఆదివారం సాహును తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తిని శివప్పగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్‌కు నాలుగు రోజుల ముందే శివప్ప పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకుపై అమితమైన ప్రేమ చూపించే శివప్ప.. కుమారుడి మృతితో డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి బస్టాండు వద్ద ఆడుకుంటున్న సాహుని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.