- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు కూలీలకు తీపికబురు.. 28న ఆర్థికసాయం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో రైతు కూలీల లెక్కలు తీసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకు ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటోంది. జాబ్ కార్డు ఉన్న వారిలో వ్యవసాయం భూమి లేని కూలీలు ఎంత మంది ఉన్నారోనని ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
రైతులకు ప్రభుత్వం ఏడాదికి రూ.10వేల చొప్పున రైతు భరోసా పేరుతో ఇస్తున్న పంటసాయం మాదిరిగానే వ్యవసాయ కూలీలకు కూడా ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్థిక సాయం ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కూలీలు ఎందరున్నారనే లెక్కలు తీస్తోంది. ఈ పథకంలో అర్హుల ఎంపిక కోసం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ పథకంలో ప్రయోజనం పొందుతామనే ధీమాతో ఉపాధి కూలీలున్నారు. మరో పక్క ఉపాధి హామీకూలీల్లో వ్యవసాయ భూమి లేని కూలీలు ఎందరున్నారనే విషయంపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది. వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం అమలుపై ఫైనల్ గైడ్ లైన్స్ ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించకపోయినా వ్యవసాయ కూలీల్లో అంచనాలు పెరిగాయి.
ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కూలీలుగా పని చేస్తున్న వారిలో సగానికి పైగా వ్యవసాయ భూములున్నవారే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరికి తక్కువ విస్తీర్ణంలో, మరి కొందరికి అతి తక్కువ విస్తీర్ణంలో భూములుండగా, ఎకరాల కొద్దీ భూములున్న మోతుబరి రైతులు కూడా ఉపాధి కూలీలుగా జాబ్ కార్డులు పొంది కూలీలుగా పనిచేస్తున్నారు. భూమి లేని కూలీలకే పథకంలో ప్రయోజనం కలిగిస్తామని ప్రభుత్వం భావిస్తే దాదాపు సగానికి పైగా ఉపాధి జాబ్ కార్డులున్న వారు ఈ పథకంలో ప్రయోజనం పొందకుండా పోతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
28న రూ.6వేల ఆర్థికసాయం అందేది ఎందరికో..?
నిజామాబాద్ జిల్లాలో 2,56,469 కుటుంబాలు జాబ్ కార్డులు పొందాయి.జాబ్ కార్డులు పొందిన కుటుంబాల్లో 4,80,843 మంది సభ్యులున్నారు. ఉపాధిహామీలో 1,25,670 కుటుంబాల్లోని 1,82,597 మందికి ఉపాధి హామీలో పని కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 261 కుటుంబాలు వంద పని దినాలు పూర్తి చేసుకున్నాయి.
కామారెడ్డి జిల్లాలో 2,50,120 కుటుంబాలు జాబ్ కార్డులు పొందాయి. జాబ్ కార్డులు పొందిన కుటుంబాల్లో 4,79,544 మంది సభ్యులున్నారు. ఉపాధిహామీలో 1,24,037 కుటుంబాలకు పని కల్పించగా, 1,82,597 మంది ఉపాధి హామీలో ప్రయోజనం పొందారు.ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 495 కుటుంబాలు వంద పని దినాలు పూర్తి చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.