జాంబీ ల్యాండ్‌లా తయారైన కొవిడ్ హాస్పిటల్స్ : బాలీవుడ్ యాక్ట్రెస్

by Jakkula Samataha |
జాంబీ ల్యాండ్‌లా తయారైన కొవిడ్ హాస్పిటల్స్ : బాలీవుడ్ యాక్ట్రెస్
X

దిశ, సినిమా : కమెడియన్ ప్రశాంతి సింగ్ కొవిడ్ టైమ్స్‌ ఎంత దారుణంగా ఉన్నాయో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వివరించింది. ఉత్తరప్రదేశ్, లక్నోలోని ఓ హాస్పిటల్‌లో పరిస్థితిని కళ్లకు కట్టినట్లుగా వివరించింది. తన తల్లికి కరోనా పాజిటివ్ రావడంతో బ్రీతింగ్ ప్రాబ్లమ్ తలెత్తిందని, దీంతో బుధవారం రాత్రి తనను హాస్పిటల్‌లో జాయిన్ చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే ఈ సమయంలో ఆస్పత్రిలో బెడ్ దొరకడం కూడా కష్టమైందని.. చివరకు ఎలాగోలా బెడ్ సంపాదించామని చెప్పింది. అయితే అక్కడి సిస్టమ్ చూశాక.. తనను ఒంటరిగా వదిలేయడం మంచిది కాదని తెలిసిందని, పేషెంట్‌ను బతికించుకోవాలంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు స్వచ్ఛందంగా కరోనాను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని అర్థమైందని తెలిపింది.

అమ్మను హాస్పిటల్‌లో జాయిన్ చేశాక.. 12 గంటలు ఆక్సిజన్ సిలిండర్ కోసం తిరిగానని, ఆ తర్వాత మరో 12 గంటలు మేనేజ్‌మెంట్ హెల్ప్ కోసం బెగ్ చేశానని వెల్లడించింది. అప్పుడు ఒక వార్డ్ బాయ్.. ‘ఎవరికి కాల్ చేసినా లాభం లేదు, ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్క వార్డ్ బాయ్‌కు రూ. 100-50 ఇస్తే పని జరిగిపోతుంది. ఆక్సిజన్ సిలిండర్ రాగానే బేతాళుడి మాదిరిగా పట్టుకొని ఉండాలి’ అని వాస్తవ పరిస్థితిని వివరించాడని పేర్కొంది. ఆ తర్వాత 18 గంటలు ‘ఆఫ్ లోడింగ్ బాయ్, ట్రాలీ బాయ్, పైప్ ఫిక్సింగ్ బాయ్’.. ఇలా అందరితో ఫ్రెండ్‌షిప్‌ చేసే క్రమంలో టైమ్ గడిచిపోయిందని తెలిపింది. కానీ ఫ్రైడే ఈవినింగ్ సిచ్యువేషన్ సీరియస్‌గా మారి, ఆక్సిజన్ సిలిండర్ల షార్టేజ్ ఎక్కువైందని.. కొత్తగా ఏర్పడ్డ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయలేక పోయారని చెప్పింది. ఇక శనివారం ఉదయం సిలిండర్లు రావడంతో.. ప్రతీ ఒక్కరు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారని చెప్పింది. తాను కూడా ట్రై చేస్తుండగా.. వెయిట్ మోయలేని తనకు లంచం తీసుకునే ఫ్రెండ్ దయతో హెల్ప్ చేశాడని చెప్పింది.

‘ప్రస్తుతం అమ్మ స్లోగా రికవర్ అవుతోంది. మరో సిలిండర్ కోసం నా ప్రయత్నాల్లో నేనున్నా. ఈ క్రమంలోనే డెడ్ బాడీస్‌ను చూడడం భయమేసింది’ అని తెలిపిన ప్రశాంతి సింగ్.. రాత్రి చాలా భారంగా గడుస్తోందని, ఒక వృద్ధురాలు కొవిడ్ పాజిటివ్ ఉన్న తన భర్తకు ఆక్సిజన్ సిలిండర్ పొందేందుకు పరుగెత్తడం.. పక్కనే ఉన్న బెడ్‌లో చనిపోయిన వ్యక్తి బంధువులు హృదయవిదారకంగా రోదించడంతో గుండె బరువెక్కిందని వాపోయింది. అందుకే హాస్పిటల్‌ను జాంబీల్యాండ్‌గా అభివర్ణిస్తూ.. ఈ పోస్ట్ పెట్టింది ప్రశాంతి సింగ్.

Advertisement

Next Story

Most Viewed