రామతీర్థం ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిట్ చీఫ్

by srinivas |   ( Updated:2021-01-16 06:48:36.0  )
రామతీర్థం ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిట్ చీఫ్
X

దిశ,వెబ్‌డెస్క్: రామతీర్థంలో సిట్ చీఫ్ అశోక్ కుమార్ శనివారం పర్యటించారు. విగ్రహ ధ్వంసం ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్పీ, పోలీస్ అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. కేసులో ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తు, సాధించిన పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. విచారణ తీరును ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. రామ తీర్థం ఘటనపై ఏదైనా సమాచారం తెలిస్తే 9392903400 నెంబర్‌ పై తమకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

Next Story