- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా సిరిసిల్ల ఘనకీర్తి
దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లా సాధించిన అభివృద్ధి గురించి ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు ఓ పాఠ్యాంశంగా బోధిస్తున్నారంటే ఇక్కడి ఘనకీర్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలో జరిగిన రైతు వేదికల శంఖుస్థాపన కార్యక్రమాలకు ఆయన హాజరై మాట్లాడారు. పాలనాధికారుల పాఠ్యాంశంగా సిరిసిల్ల చేరిందంటే మమూలు విషయం కాదని, ఇక్కడి గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. జిల్లాలో ఒక్క ఏడాదిలోనే 6 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయని, కాళేశ్వరం నీళ్ల రాకతోనే అది సాధ్యమైందన్నారు. దేశంలో ఎక్కడా ఒక్క ఏడాదిలో ఇంతపెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగిన చరిత్ర లేదని మంత్రి వివరించారు.అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంతో పాటు వ్యవసాయ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఏటా రూ.60 వేల కోట్లను బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి వెచ్చిస్తున్న గొప్ప రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.విపక్షాల మాటలు ఎందుకు పనికి రానివని, వీరు ఏనాడూ తెలంగాణాకు అన్యాయం జరిగిన సమయంలో మాట్లాడలేదని ఇప్పుడు కొత్త పాట పడుతున్నాయని విమర్శించారు.
హంతకులే సంతాపం తెలుపుతున్నారు : మంత్రి కేటీఆర్
హంతకులే సంతాపం ప్రకటించిన విధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల తీరు ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పోతిరెడ్డి పాడును 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినప్పుడు చూస్తూ ఊరుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారన్నారు. వ్యవసాయ పరంగా రైతాంగానికి అన్నింటా బాసటగా నిలవాలన్న సంకల్పంతోనే నియంత్రిత సాగు విధానం అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రైతు వేదిక నిర్మాణం కోసం ఉచితంగా స్థలాలు కేటాయించేందుకు ముందుకు వచ్చిన వారిని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. అలాగే నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో తానే సొంతంగా భవనాలను నిర్మించనున్నట్టు ప్రకటించారు.