సిరిసిల్ల పాఠశాలను చూసి గర్విస్తున్నా : కేటీఆర్

by Sridhar Babu |
సిరిసిల్ల పాఠశాలను చూసి గర్విస్తున్నా : కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. సిరిసిల్ల పాఠశాల అభివృద్ధిని చూసి గర్విస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి ఈ పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత స్కూల్ సిబ్బందిదే అని సూచించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇలాగే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా.. ‌మన రాష్ట్రంలోని సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయ‌ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న పిల్లల కోసం ఎంత చేసినా త‌క్కువేన‌ని చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో స్కూల్ బిల్డింగ్‌ను నిర్మించడంతో రాష్ట్రంలో సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వ‌చ్చింద‌న్నారు. త‌ల్లిదండ్రుల ప్రోత్సాహ‌మే త‌న‌ను ఇంత‌టివాడిని చేసింద‌ని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed