- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లానెట్ పరిరక్షణకు ‘అటెన్‌బరో’ సోషల్ మీడియా ఎంట్రీ
దిశ, వెబ్‌డెస్క్: లెజెండరీ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్, ప్రకృతి ప్రేమికుడు ‘సర్ డేవిడ్ అటెన్‌బరో’ ఇన్‌స్టా రికార్డులను బద్దలు కొట్టాడు. గురువారం తన పేరుమీద ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్‌ను రీచ్ అయి.. ఇన్‌స్టాను షేక్ చేశాడు. ఐదు దశాబ్దాలుగా ప్రకృతి సంరక్షణకు విశేషంగా దోహదం చేస్తున్న వ్యక్తి డేవిడ్ అటెన్‌బరో. తన రచనలు, ప్రకృతి సంరక్షణపై తీసిన అనేక చిత్రాల ద్వారా ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. భూతాపం, వాతావరణ మార్పుల వల్ల జీవజాతులకు ఏర్పడే ప్రమాదం గురించి ఆయన తరుచుగా హెచ్చిరిస్తూనే ఉంటాడు.
1954లో అటెన్‌బరో తీసిన ‘జూ క్వెస్ట్’ అనే డాక్యుమెంటరీ చిత్రం ప్రకృతి, వన్యప్రాణి సంరక్షణ అవసరాన్ని చాటి చెప్పింది. లైఫ్ సిరీస్ పేరిట తీసిన 9 చిత్రాలు పర్యావరణ సంరక్షణ విలువను చాటిచెప్పాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషికి గాను 2019లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి కూడా వచ్చింది. తాజాగా అటెన్‌బరో.. ప్రజలకు, నెటిజన్లకు మరింత చేరువయ్యే ఉద్దేశ్యంతో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం.. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన ఇన్‌స్టా అకౌంట్ 1 మిలియన్ మార్క్‌కు చేరుకుంది. దీంతో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ యూజర్ రీచ్‌తో అటెన్‌బరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే గతంలో.. జెన్నిఫర్ అనిస్టోన్స్ నెలకొల్పిన రికార్డును ఆయన బ్రేక్ చేశాడు. ఇక అతడి మొదటి వీడియో 14 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుండటం విశేషం.
‘ప్రపంచం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. ఖండాలన్నీ మండిపోతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. పగడపు దీవులన్నీ చచ్చిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటే పోతే.. ఈ జాబితాకు అంతులేదు. మన భూమిని కాపాడుకోవడం మన ముందున్న అతిపెద్ద చాలెంజ్. మనందరికీ ఏం చేయాలో తెలుసు. కానీ దానికి సంకల్పం కావాలి. అందుకే.. నేను ఈ మెసెజ్‌ను ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనమంతా కలిసే ఉంటామని ఆశిస్తున్నాను. మనమంతా కలిసి మార్పును తీసుకురాగలం’ అని అటెన్‌బరో తన తొలి వీడియోలో తెలియజేశాడు.