- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటు : గుత్తా
దిశ, దామరచర్ల: దామరచర్ల మండల సీనియర్ నాయకుడు, సింగిల్ విండో మాజీ చైర్మన్ పడిగపాటి పాపిరెడ్డి శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం బొత్తలపాలెంలో ఆయన భౌతిక కాయాన్ని తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గ శాసన సభ్యుడు నల్లమోతు భాస్కర్ రావు ఆదివారం సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాపిరెడ్డి మరణం పార్టీకి తీరని లోటని గుత్తా విచారం వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన అంతిమయాత్రలో భాస్కర్ రావు పాల్గొని వైకుంఠధామం వరకు పాపిరెడ్డి పాడె మోశారు. అంతిమ సంస్కారాల్లో ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు.
వారి వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎం.డీ యూసుఫ్, స్కైలాబ్ నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వీరకోటి రెడ్డి, పడిగపాటి పెద్దకోటి రెడ్డి, ఎంపీపీ రమావత్ నందిని రవితేజ నాయక్, జడ్పీటీసీ అంగోతు లలిత హతీరామ్ నాయక్, వైస్ ఎంపీపీ కటికం సైదులు రెడ్డి, ఎంపీటీసీ సోమిసైది రెడ్డి, ఎంపీటీసీ ధీరావత్ శారదా పాచు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులి జగదీష్, మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మట్టపల్లి సైదులు, దారగాని వెంకటేశ్వర్లు, నాయకులు సైదులు బాబు తదితరులు ఉన్నారు.