రికార్డు ధర పలికిన ప్రముఖ సింగర్ ‘అమీ వైన్‌ హౌస్’ దుస్తులు..

by vinod kumar |   ( Updated:2021-11-10 00:30:41.0  )
రికార్డు ధర పలికిన ప్రముఖ సింగర్ ‘అమీ వైన్‌ హౌస్’ దుస్తులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ సింగర్ అమీ వైన్‌హౌస్ దుస్తు్లకు వేలం నిర్వహించగా ఎవరూ ఊహించని విధంగా రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన తన చివరి లైవ్ కాన్సర్ట్‌లో గాయని అమీ వైన్‌హౌస్ ధరించిన ‘వెదురు-ముద్రిత’ ఆకుపచ్చ కలర్ డ్రెస్ వేలంలో $243,200 (సుమారు ₹1.80 కోట్లు)కి అమ్ముడు పోయింది.

ఈ కాస్టుమ్‌ను స్టైలిస్ట్ నవోమి ప్యారీ రూపొందించారు. అమీ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ దుస్తులు నిర్వాహకులు అంచనా వేసిన వాల్యూ కంటే 16 రెట్లు అధిక ధరకు అమ్ముడు పోవడం విశేషం. బ్రిటన్‌కు చెందిన ఫేమస్ సింగర్ అమీ తన చివరి లైవ్ ప్రొగ్రామ్‌ ఇచ్చిన ఒక నెల తర్వాత.. 27 ఏళ్ల యంగ్ ఏజ్‌లోనే లండన్‌ నగరంలో ఆమె తీసుకున్న అల్కాహాల్ పాయిజన్ అయ్యి 23 జూలై 2011న మరణించింది.అయితే, అమీ సింగర్, రైటర్, రిథమిస్ట్‌గా కూడా రాణించింది.

కత్రినాకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్న విక్కీ.. ఎన్ని కోట్లో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed