సింగరేణి బిడ్డకు అమెరికా వర్శిటీలో సీటు

by Shyam |
సింగరేణి బిడ్డకు అమెరికా వర్శిటీలో సీటు
X

దిశ, న్యూస్ బ్యూరో: మంచిర్యాలలోని సింగరేణి ఉద్యోగి కుమార్తె సుహర్షకు అమెరికాలోని అబర్న్ యూనివర్శిటీకి చెందిన స్కూల్ఫ్ ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్‌లో సీటు లభించింది. ప్రస్తుతం తెలంగాణ ఫారెస్టు కాలేజీ అండ్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న సుహర్షకు ఆ విశ్వవిద్యాలయంలో ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు కోసం అవకాశం వచ్చింది. రెండేళ్ళ కోర్సుకు అయ్యే సుమారు 30 వేల డాలర్ల ఫీజుకు యూనివర్శిటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు 1500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కూడా ఆఫర్ చేసింది. గతంలో సూర్యదీపిక అనే విద్యార్థినికి సైతం ఫారెస్టు జెనటిక్స్ కోర్సులో (ఎంఎస్‌సీ) అవకాశం లభించింది. ఈ అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని, కాలేజీలో అనువైన వాతావరణం, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే సాధ్యమైందని సుహర్ష తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ ఫారెస్టు కాలేజీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్‌లో మొత్తం 49 మంది విద్యార్థుల్లో 31 మంది అమ్మాయిలే. ఆరుగురు విద్యార్థినులు డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సీటీ వుడ్ టెక్నాలజీలో ఎం.ఎస్సీ చేసేందుకు సిద్దమౌతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని తొలిసారిగా ఎంట్రెస్ టెస్ట్ కేంద్రాన్ని కూడా హైదరాబాద్ నిర్వహించేందుకు డెహ్రాడూన్ వర్శిటీ అంగీకరించింది. ఫైనల్ ఇయర్‌లో ఉన్న మరో 20 మంది సివిల్ సర్వీసు పరీక్షలు రాసేందుకు సిద్దమవుతున్నారు.

Advertisement

Next Story