సిక్స్ మినిట్ షాట్.. సింగిల్ టేక్

by Shyam |
సిక్స్ మినిట్ షాట్.. సింగిల్ టేక్
X

దిశ, సినిమా : కోలీవుడ్ సూపర్‌ స్టార్ శింబు అప్‌కమింగ్ మూవీ ‘మానాడు’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శింబు ముస్లిం యువకుడిగా నటిస్తుండగా.. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ అందింది. ప్రస్తుతం ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్‌లో ఉండగా.. సిక్స్ మినిట్ షాట్‌ను సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసిన శింబుపై కోలీవుడ్‌ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది. కాగా ఈ షాట్‌లో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, ఎస్.జె.సూర్య పాల్గొన్నాడు. వీ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌‌తో నిర్మాత సురేశ్ కామాచి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. భారతీ రాజా, ఎస్.ఎ. చంద్రశేఖర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

Advertisement

Next Story