- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో తొలిసారి.. సిగ్నల్ వ్యవస్థలో జెండర్ ఈక్వాలిటీ
దిశ, వెబ్‌డెస్క్ : ట్రాఫిక్ సిగ్నల్స్.. గ్రీన్, రెడ్ అండ్ ఆరెంజ్ రంగుల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. వాహనదారులతో పాటు పాదచారులకు కూడా సిగ్నల్స ఉంటాయి. కానీ, పాదచారుల సిగ్నల్‌ను మనం పరిశీలించినట్టయితే.. వాటిలో ఎక్కడ చూసినా మేల్ ఫిగర్ మాత్రమే కనిపిస్తుంది. సో వాట్ అంటారా? పురుషాధిక్య ప్రపంచంలో ఇది చాలా కామన్ అండ్ సిల్లీ విషయంగానే కనిపిస్తుంది. కానీ జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు మనం చేసే పనుల్లోనూ ఆ భావనలు, వాటి తాలూకు చర్యలు కనిపించాలి. ఈ దిశగానే ముంబై నడుం బిగించింది. దేశంలో తొలిసారిగా నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌లో లింగ సమానత్వాన్ని (జెండర్ ఈక్వాలిటీ) పాటించింది.
12 మిలియన్ల జనాభా గల ముంబై నగరం.. ట్రాఫిక్ సిగ్నల్స్ విషయంలో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్స్ సిగ్నల్స్‌లో మనుషులు నడిచేందుకు సూచించే గ్రీన్, రెడ్ సిగ్నల్స్‌లో పురుషుల సింబల్స్ మాత్రమే ఉండేవి. కానీ ముంబైలోని ‘జి నార్త్’ వార్డులోని పలు చౌరస్తాల్లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లపై మహిళల బొమ్మలను ఏర్పాటు చేశారు. దాదర్, మహిమ్ మధ్యన 4.5 కిలోమీటర్ల మేర మొత్తంగా 13 జంక్షన్లలో ఇలాంటి సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. కాగా.. జెండర్ ఈక్వాలిటీతో పాటు దాని ఆవశ్యకతను, మహిళా సాధికారతను పెంచేందుకే ఇలా చేశామని ముంబై మునిసిపల్ కమిషనర్ చెప్పుకొచ్చారు. జర్మనీలోని పలు నగరాల్లో మహిళల సింబల్స్ ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయని, దేశంలో ఇలాంటివి ఏర్పాటు చేయడం ముంబైలోనే తొలిసారని బీఎంసీ అదనపు కమిషనర్ కిరణ్ తెలిపారు. వీటి కోసం పోలీస్ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందారు.
ఈ జెండర్ ఈక్వాలిటీ ఇనీషియేటివ్‌పై కేబినేట్ మినిస్టర్ ఆదిత్య ఠాక్రే స్పందించారు. ‘దాదర్ నుంచి మీరు వెళుతుంటే.. సిగ్నల్ వ్యవస్థలో ఏర్పాటు చేసిన వుమెన్ సింబల్స్ చూసి మీరు తప్పకుండా గర్వంగా ఫీలవుతారు. చిన్న ఐడియా కానీ.. గ్రేట్ ఇంపాక్ట్’ అంటూ ట్వీట్ చేశారు.
If you’ve passed by Dadar, you’d see something that will make you feel proud. @mybmcWardGN is ensuring gender equality with a simple idea- the signals now have women too! pic.twitter.com/8X0vJR8hvQ
— Aaditya Thackeray (@AUThackeray) August 1, 2020