- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిద్దిపేట మున్సిపాలిటీకి మరో అరుదైన రికార్డు..
దిశ, సిద్దిపేట: కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆత్మనిర్బర్ పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలు అందించి దేశంలోనే సిద్ధిపేట మున్సిపాలిటీ రెండవ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా యూఎల్‌బీ-మున్సిపాలిటీ కమిషనర్లతో మిశ్రా నేతృత్వంలో బుధవారం సాయంత్రం వెబ్ కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఇందులో ఆత్మనిర్బర్ నిధి కింద వీధి వ్యాపారులకు రుణాలు అందించి దేశంలోనే సిద్ధిపేట మున్సిపాలిటీ రెండవ స్థానంలో నిలిచినట్లు కేంద్ర మంత్రిత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ సెక్రెటరీ శ్రీ దుర్గ శంకర్ మిశ్రా తెలిపారు.
ఈ మేరకు సిద్ధిపేట మున్సిపాలిటీలో వీధి విక్రయదారులకు ఆత్మ నిర్బర్ నిధి పథకంలో భాగంగా రుణాలు ఇప్పించడంలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ చూపి ముందు వరుసలో నిలిచేలా ప్రోత్సహించారని వెబ్ కాన్ఫరెన్స్‌లో సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి వెల్లడించారు. ఈ విషయమై మున్సిపాలిటీ పరిధిలోని 4,815 మంది వీధి వ్యాపారులకు మేలు చేకూరేలా చేపట్టిన కార్యక్రమం హర్షనీయమని మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజుల రాజనర్సు వివరించారు. ఈ వెబ్ కాన్ఫరెన్స్‌లో మెప్మా డీఏంసీ హన్మంతరెడ్డి, ఏడీఏంసీ సంతోషి, టీఏంసీ సాయి కృష్ణ, సీఓలు పాల్గొన్నారు.