మొక్కలు నాటి నాపై అభిమానాన్ని చాటండి : స్టార్ హీరో 

by Shyam |
sidharth malhotra
X

దిశ, సినిమా: మొక్కలు నాటుదాం- ప్రకృతిని కాపాడుకుందాం అని పిలుపునిస్తోంది ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’. ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతి హృదయాన్ని కదిలిస్తూ.. ఉధృతంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తాజా సినిమా ‘యోధ’ షూటింగ్‌ స్పాట్‌లో.. సినిమా డైరెక్టర్లు సాగర్ అంబ్రే అండ్ పుష్కర్ ఓజాతో కలిసి ముంబైలోని వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధార్థ్.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల మనుగడ కోసం అభిమానులందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story